దేశ రాజధాని ఢిల్లీలోనే కాదు.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోనూ గత కొద్ది రోజులుగా కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తోన్న నేపథ్యంలో ఉదయాన్నే నగరంపై దట్టమైన పొంగమంచు కమ్ముకుని ఉంటోంది. దీంతో విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబైలో ఎయిర్ క్వాలిటీ ప్రస్తుతం అధ్వానంగా ఉందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్- ఇండియా తెలిపింది. ఈ పరిస్థితికి కారణం పరిశ్రమలు, అధికంగా వాహనాల వినియోగమేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.