బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావం వల్ల మండుస్ తుఫాను ప్రభావంతో జిల్లా అంతట ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాలలో మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలంలో 58. 2, కాజీపేట మండలంలో 45. 8, చాపాడు మండలంలో 27. 6, మైదుకూరు మండలంలో 30. 8, దువ్వూరు మండలంలో 32. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నియోజకవర్గ వ్యాప్తంగా బ్రహ్మంగారిమఠం మండలంలో అత్యధికంగా 58. 2మి. మీ వర్షపాతం నమోదయింది. అత్యల్పంగా చాపాడు మండలంలో 27. 6 మి. మీ నమోదయింది.