ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వం చిన్న చూపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 11, 2022, 12:51 PM

10వ తేదీ వచ్చినా విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యం వహిస్తున్నదని జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఖాదర్ బాషా అన్నారు. శనివారం కమలాపురం తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో సుమారు 1000 మంది వివిధ డిపార్ట్మెంట్లలో పదవీ విరమణ పొంది పెన్షన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న విశ్రాంతి ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా వారి అకౌంట్ లో పెన్షన్ జమ చేయకపోవడం శోచనీయమని ఆయనాన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 5వ తేదీ లోపే వారి ఖాతాల్లో పెన్షన్ జమ అయ్యేదని ఆయన అన్నారు. ప్రతి నెల ఐదో తారీకు లోపు పెన్షన్ అందేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com