దేశంలో రైతుల ఆత్మహత్యలలో మన రాష్ట్రం మూడో స్థానం, కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండవ స్థానం సాధించడంలో వైయస్సార్ పార్టీ ఘనత తగ్గించుకుందని కొరిసపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాగర్లమూడి జయకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నాడు లోకల్ యాప్ తో మాట్లాడుతూ వైసిపి మూడున్నర ఏళ్ల పాలనలో 1674 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షలు ఇస్తామన్న వైసిపి హామీని విస్మరించిందని జయకృష్ణ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.