మాండూస్ తుఫాను కారణంగా రాజంపేట నియోజకవర్గంలో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతూ ఉండటం వల్ల రాజంపేట నియోజకవర్గంలోని అరటి, బొప్పాయి తోటలు వందల ఎకరాలలో దెబ్బ తినడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి రాజంపేట శాసనసభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి తక్షణమే సచివాలయ పరిధిలోని హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా శనివారం ఆదేశాల ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ గిరీషను ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సంప్రదించి రాజంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి అరటి, బొప్పాయి పంటల నష్టాలను చర్చించారు. కలెక్టర్ స్పందించి వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే సంబంధిత అధికారులను పొలాల దగ్గరకు పంపి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం నుండి అందవలసిన సాయాన్ని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు.