హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత ముఖేష్ అగ్నిహోత్రి చేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు గానూ కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది.