గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహాన్ని కొత్తగా, పర్యావరణహితంగా జరిపించి శెభాష్ అనిపించుకున్నారు సూరత్‌కు చెందిన విపుల్ పటేల్ ఓ రైతు. కుమార్తె రిద్ధి పెళ్లి ద్వారా ప్రజలకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో బంధువులకు తులసి విత్తనాలతో కూడిన వివాహ ఆహ్వాన పత్రికలను అందించాడు. పెళ్లి సమయంలో వధూవరూలను ఎడ్ల బండిలోనే మండపానికి తీసుకువచ్చాడు. కన్యాదానం చేసేటప్పుడు కూతురికి ఒక గిర్ జాతి ఆవును కానుకగా ఇచ్చాడు. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులతోనే వంటకాలు చేయించి విందును ఏర్పాటు చేశాడు. తినే ప్లేట్లు, నీళ్ల గ్లాసులు సహా ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు విపుల్. వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఆయన ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.