రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజీపీయేతర కూటమికి నాయకత్వం వహించే శక్తి సామర్ధ్యాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం గుజరాత్ లో మాత్రమే గెలిచారని ప్రధాని గుర్తుంచుకోలన్నారు. గుజరాత్ ఓటమితో కాంగ్రెస్ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఢిల్లీ వెలుపల పంజాబ్ హర్యాణాలో మినహా ఆప్ కు పెద్దగా ఆదరణ లేదని తెలిపారు. గుజరాత్ పై కాంగ్రెస్ కు పెద్దగా ఆశలు లేవు కానీ, ప్రతి ఎన్నికల్లో శక్తివంచన లేకుండా పోరాడుతున్నామన్నారు. ప్రతిపక్షాలను కూడగట్టి, వాటితో కొనసాగడం అంత సులభం కాదు అని చిదంబరం వ్యాఖ్యానించారు.