ధర్మవరం పట్టణంలోని పాండురంగ సర్కిల్ లో మున్సిపల్ కాంప్లెక్స్ లోని నేత్రాలయ కంటి పరీక్ష కేంద్రంలో సోమవారం కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి డాక్టర్ కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆప్తాల్- డివోఏ ప్రవీణ్ కుమార్ రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో 50 మంది రోగులు పాల్గొనగా 20 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కంటి పరీక్షకు విశేష స్పందన లభించిందన్నారు.