పల్లేరు కాయలు అంటే తెలియని వారుండరు. కానీ వీటితో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? పల్లేరు కాయలో చలువ చేసే గుణాలు కలిగి ఉంటాయి. మూత్రపిండాల సమస్యలకు పల్లేరుకాయలు మంచి ఔషధంలా పని చేస్తాయి. ఐతే ఇవి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో గ్లాసు పాలు తీసుకొని వేడి చేయాలి. వీటిలో 3 నుండి 4 పల్లేరు కాయల్ని తీసుకొని పొడి చేసుకొని వేయాలి. ఈ పాలను సన్నని సెగపై వేడిచేయాలి. తర్వాత ఈ పాలను వడకట్టి గ్లాసులోకి తీసుకోని, తీపికొసం తేనెను కలుపుకోవాలి. ఈ పాలను వారానికి నాలుగుసార్లు తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రపడడంతో పాటు, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. స్త్రీలు ఈ పాలను తీసుకోవడం వల్ల నెలసరి సమస్యలు, గర్భాశయ సమస్యలు తగ్గుతాయి.