మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చెవిటి, మూగ దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బార్మర్ జిల్లాలో 20 ఏళ్ల చెవిటి, మూగ దళిత యువతి నవంబర్ 24న మేకలు మేపేందుకు వెళ్లింది. యువతి ఒంటరిగా ఉండడం గమనించిన సునీల్, భజన్ లాల్ అనే వ్యక్తులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. దాదాపు 17 రోజుల తర్వాత నిందితులను అరెస్టు చేసినట్లు బార్మర్ జిల్లా ఎస్పీ తెలిపారు.