బస్సు బోల్తాపడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెంబూరుకు చెందిన 48 మంది విద్యార్థులతో విహారయాత్రకు వెళ్లిన బస్సు, ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో కోఫోలి పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, చాలా మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బస్సుపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.