ఈ మధ్య కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొవ్వు ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదని అంటున్నారు. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయామాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అలవాటు లేని ఎక్సర్‌సైజ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు.