ప్రతిపక్షాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైరయ్యారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలుగుదేశం, జనసేన పార్టీలు రైతులను వాడుకుంటున్నాయని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లకు జన్మనివ్వడం ఆంధ్ర ప్రదేశ్ చేసుకున్న పాపం అని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు రైతులకు ఇవ్వాల్సిన బీమా డబ్బులను ఎగ్గొట్టి, పసుపు కుంకుమ పేరుతో పంచిపెట్టారని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 మంది రైతుల కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం పరిహారం అందించిందని మంత్రి తెలిపారు.