సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రదాన న్యాయమూర్తి పి. జ్యోతిర్మయి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.