దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సగటున 8 శాతం మాత్రమేనని పార్లమెంటులో కేంద్రం తెలిపింది. ఛత్తీస్ గడ్ లో అత్యధికంగా 14.44 శాతం మహిళా ఎమ్మెల్యేలు ఉండగా, బెంగాల్ లో 13 శాతం, జార్ఖండ్ లో 12 శాతం, రాజస్థాన్ లో 12 శాతం, ఉత్తర ప్రదేశ్ లో 11.66 శాతం ఉత్తరాఖండ్ లో 11.43 శాతం, ఢిల్లీలో 11.43 శాతం పంజాబ్ లో 11.11 శాతం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 10 శాతం లోపే ఉంది. కాగా, అసెంబ్లీలతో పోలిస్తే పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంది. లోక్ సభలో మహిళా ఎంపీలు 14.94 శాతం ఉండగా, రాజ్యసభలో 14.05 శాతం ఉన్నారు.