రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి శూన్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆరోపించారు. నగరంలోని 10వ డివిజన్లో ‘ఇదేంఖర్మ’ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ.... వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జగన్ ఏక పక్ష ధోరణితో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్ర బాబుకు రాయలసీమలో వచ్చిన ఆదరణ చూసి వైసీపీ నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.