సీపీఎస్‌కు జీపీఎస్ ప్రత్యామ్నాయం కాదని, ఓపీఎస్ మాత్రమే అమలు చేయాలని ఏపీ యుటీఎఫ్ పశ్చిమ గోదావరిజిల్లా ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామ భద్రం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దశల వారీ పోరాటంలో భాగంగా ఆదివారం ఉదయం మార్టేరు సెంటర్ నుంచి పెనుగొండ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన తమవాగ్దాలను అమలు చేయాలన్నారు. జిల్లా కోశాధికారి సీహెచ్.పట్టాభిరామయ్య, జిల్లా కార్యద ర్శులు ఎం.శ్రీనిబాబు, పి.కాంతికుమార్, రామాంజరావు, ఎ.వెంకట్రావు పాల్గొన్నారు.