విశాఖపట్నం, గొలుగొండ, మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో రంగురాళ్ల తవ్వకాలు గుట్టుగా సాగుతున్నాయి. గతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతంలోనే మరలా చేపడుతున్నారు. తవ్వకాలు జరుపుతుండగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు వస్తున్నట్టు గుర్తించి తవ్వకందారులు పరారయ్యారని నర్సీపట్నం ఫారెస్ట్ సెక్షన్ అధికారి కేవీ రమణ తెలిపారు. అనంతరం తవ్వకాలు చేపట్టిన గొయ్యిలను మట్టితో పూడ్చినట్టు ఆయన చెప్పారు. రంగురాళ్ల తవ్వకాల నియంత్రణకు ప్రత్యేక సిబ్బందితో నిఘా పెట్టామన్నారు.