టెస్ట్‌ల్లో పేలవ ఫామ్‌తో నిరుత్సాహపరుస్తున్న సీనియర్ క్రికెటర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. ఆ జాబితాలో అంజిక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 21న జరిగే బోర్డు అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో సెంట్రల్ కాంట్రాక్ట్‌పై నిర్ణయం తీసుకోన్నారు. గిల్, సూర్యకుమార్ యాదవ్‌కు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.