టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్‌లో ధావన్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ శ్రీలంక సిరీస్‌కు ధావన్ ఉంటాడో? లేదో? చూడాలని, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్ లను సెలెక్టర్లు ఎలా దూరం పెట్టగలరని ప్రశ్నించాడు. రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్ కు అందుబాటులో ఉంటే జట్టు నుంచి ఒకరు వైదొలగాల్సిన పరిస్థితి వస్తుందని, ఆ పరిస్థితి ధావన్‌కే రావొచ్చని అన్నాడు. ధావన్ అద్భుతమైన కెరీర్ కు ఇదొక బాధాకర ముగింపు అవుతుందని, వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడం ధావన్ కు కష్టమేనని అభిప్రాయపడ్డాడు.