ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారకం పొగ తాగటం. అలాగని పొగ తాగనివారికి రాకూడదనేమీ లేదు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడుతున్నవారిలో సుమారు 20% మంది సిగరెట్ల జోలికి వెళ్లనివారే. రోజూ పెరుగు, అలాగే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవటం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. రోజుకు సుమారు 85 గ్రాముల పెరుగు తినే మగవారికి, 113 గ్రాముల పెరుగు తినే ఆడవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు 19% వరకు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనం సూచిస్తోంది. అలాగే పీచు లభించే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 17% తక్కువగా ఉంట్టున్నట్ట బయటపడింది.