కేశాల సంరక్షణకి ఉసిరి చాలా మంచిది. సహజంగా జుట్టు పెరుగుదల, అందంగా ఉండేందుకు జుట్టు రంగు కోల్పోకుండా చేసేందుకు ఉసిరి మంచిగా సహాయపడుతుంది. ఉసిరిని గింజ తీసేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని తల మాడుకు, జుట్టు మొదళ్ళకి బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల జుట్టు రాలే సమస్యతో పాటు తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. ఉసిరి ఆకులను కూడా మెత్తగా రుబ్బుకుని పేస్ట్ లాగా చేసుకుని తలకి పట్టించుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది.