దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐఎంలు, ఐఐటీల్లో 11 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ‘45 సెంట్రల్ వర్సిటీల్లో మొత్తం 18,956 అధ్యాపక పోస్టులకు గాను 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీల్లో 4,502, ఐఐఎంలలో 493 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది’ అని మంత్రి ధర్మేంద్రప్రధాన్ వెల్లడించారు. ఆయా పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు.