సిమ్‌కార్డుల్లో ఉండే అతి పలచని బంగారం పూత నుంచి ఔషధాలను తయారు చేసే విధానాన్ని లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు కనిపెట్టారు. అయితే, ప్రమాదరహితంగా సిమ్‌ల నుంచి బంగారాన్ని సేకరించే పద్ధతిని ఇటలీలోని కాగ్లియరీ వర్శిటీ వారు ఇటీవల రూపొందించారు. దానిని మందుల తయారీకి మళ్లించే ప్రక్రియను ఇంపీరియల్ కాలేజీ అభివృద్ధి చేసింది.