తగ్గుతున్న జనాభాను పెంచేందుకు జపాన్ మరో నిర్ణయం తీసుకుంది. పిలల్ని కన్నా తల్లిదండ్రులకు రూ.3 లక్షల నజరానా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఆ దేశంలో 2009 నుంచి పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు రూ.2.50 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచారు. జపాన్‌లో డెలివరీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒక్కో డెలివరీకి రూ.2.60 లక్షల వరకు ఖర్చువుతుండటం గమనార్హం.