పోలీసు ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని ఐదేళ్లు సడలించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ పోలీసు నియామకాల బోర్డు చైర్పర్సన్కు సోమవారం ఆయన లేఖ రాశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. పోలీసు శాఖలో ఖాళీలను ప్రతిఏటా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు మూడున్నరేళ్ల తర్వాత జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలతో చాలామందికి పోలీసు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయని తెలిపారు.