వైసీపీ పాలనంతా ఆర్భాటమే తప్ప అభివృద్ధి లేదని టీడీపీ నాయకులు విమర్శించారు. సోమవారం సాయంత్రం అనంతపురం జిల్లా పరిధిలోని యర్రగుంట్ల గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ..... వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ద్ధి జరగలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంచుతూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీతో అందుతున్న పథకాలను సీఎం జగన్మోహనరెడ్డి రద్దు చేసి రైతుల నడ్డి విరిచారన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని సూచించారు.