ఇటీవల గుజరాత్ ప్రజల ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా సందీప్ కు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఓ రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కనీసం 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. ఆప్.. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉండగా.. గోవాలో 2 సీట్లు, గుజరాత్ లో 5 స్థానాల్లో గెలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa