ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌

national |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 07:14 PM

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఎఫ్​డీలపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన​ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 7-45 రోజుల మధ్య మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 3%, 46-179 రోజుల మధ్య ఎఫ్​డీపై 3.9 %, 180-210 రోజుల మధ్య 5.25% వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్​డీలపై 5.75% వడ్డీ చెల్లిస్తుంది. 1-2 ఏళ్ల మధ్యలో మెచ్యూర్​ అయ్యే ఎఫ్​డీపై 6.75 %, 2-3 మూడేళ్ల వరకు అయితే 6.75 %, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అయితే 6.25% వడ్డీ రేటు వర్తిస్తుంది.


ఇక సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తుంది. తాజా సవరణతో, సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5- 7.25% వరకు అందిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa