దానిమ్మ తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-వైరల్, యాంటీ-ట్యూమర్ లక్షణాలు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. టైప్-2 డయాబెటిస్‌తో పోరాడటానికి, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి సాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా సాగడానికి, చర్మ సమస్యలను పోగొట్టి మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతుంది.