ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ పై భారత్ లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశ భద్రతకు ముప్పు ఉందంటూ టిక్ టాక్ తో సహా వందలాది చైనా యాప్ లను ప్రభుత్వం నిషేధించింది. ఇక ఈ యాప్ పై అమెరికాలోనూ వేటు పడనున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ యాప్ తో అమెరికన్లపై చైనా నిఘా పెడుతుందంటూ చట్ట సభ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, టిక్ టాక్ పై నిషేధం ప్రతిపాదిస్తూ డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు ఓ బిల్లును సైతం ప్రవేశపెట్టాయి. అయితే 2020 లోనే ట్రంప్ సర్కారు కొత్త యూజర్లు టిక్ టాక్ డౌన్ లోడ్ చేసుకోకుండా ఆంక్షలు విధించినా, తర్వాత కోర్టు ఈ ఆంక్షలను నిలిపివేసింది.