టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ తన తొలి రంజీ మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీలో గోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ బుధవారం రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ చేశాడు. 186 బంతుల్లో 112* పరుగులతో ఆడుతున్నాడు. 1988 లో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో గోవా జట్టు 5 వికెట్లు కోల్పోయి 410 స్కోర్ చేసింది. ప్రభుదేశాయ్ 172*, అర్జున్ టెండుల్కర్ 112* పరుగులతో ఆడుతున్నారు.