ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీపీపీ విధానానికి రైల్వే శాఖ రెడ్ సిగ్నల్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 04:09 PM

పీపీపీ విధానానికి రైల్వే శాఖ రెడ్ సిగ్నల్ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రైల్వే స్టేషన్లను మానిటైజ్ చేసే విధానానికి రైల్వే శాఖ స్వస్తి చెప్పనున్నట్లు తెలుస్తోంది. దానికి బదులుగా ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది రైల్వే శాఖ రూ.30 వేల కోట్లు సమీకరించాల్సి ఉండగా.. ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో రూ.1829 కోట్లు మాత్రమే ఆ శాఖ ఆర్జించింది. ఈ ఏడాదికి రూ.4,999 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa