అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చొరబడేందుకు యత్నించిన చైనా ఆర్మీని డిసెంబర్ 9న భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం పార్లమెంట్ లో ప్రకటన కూడా చేసింది. తాజాగా ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ‘భారత్-చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వద్ద పరిణామాలను మా రక్షణ శాఖ జాగ్రత్తగా గమనిస్తోంది. సరిహద్దుల్లో చైనా.. తమ దళాలను మోహరించి పలు నిర్మాణాలు చేపడుతోంది. ఉద్రిక్తతలు తగ్గించే విషయంపై భారత్ తీసుకుంటున్న చర్యలకు పూర్తి మద్దతిస్తున్నాం’ అని పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa