ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా జట్టు ఫైనల్స్ చేరింది. లియోనెల్ మెస్సీ సారథ్యంలో జట్టు అద్భుత ఆటతీరును కనబర్చి తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో పత్యర్థి జట్టు క్రొయేషియాను 3-0తో ఓడించారు. ఇక అర్జెంటీనా ఫైనల్స్‌కు చేరడంతో ఆ దేశంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రాజధాని నగర వీధుల్లోకి వేలాదిమంది ప్రజలు వచ్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానుల కోలాహలంతో ఆ వీధులు కిక్కిరిశాయి. మెస్సీ పేరు జపిస్తూ ఆయన జర్సీలు ధరించి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీళ్ల అభిమానాన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa