శ్రీకాకుళం జిల్లాకే ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా మారాల్సిన ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ భూములకు రక్షణ కరువైంది. యూనివర్సిటీ ఏర్పాటు సమయంలో వచ్చిన 20 ఎకరాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఆధారంగా 125 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూములకు ప్రహరీ లేకపోవడంతో. భూముల హద్దులు వద్ద కొంత మేర ఆక్రమణకు గురవుతుందని ఆరోపణలు ఉన్నాయి. ప్రహరి నిర్మించేందుకు గతంలో ప్రతిపాదనలు చేసినప్పటికీ. ఆ తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. ఎచ్చెర్లలో భూముల విలువ కూడా భారీగా పెరగడంతో. ఆక్రమణలకు మరింత అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఉన్న భూమిని వినియోగించుకోవడంలోనూ యూనివర్సిటీ విఫలమవుతోంది. ఈ భూముల ద్వారా ఆదాయం పొందే అవకాశాలను విస్మరిస్తోంది. ఆక్రమణలకు గురికాక ముందే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa