తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నర్సీపట్నంలో భూ ఆక్రమణ ఆరోపణలపై అయ్యన్నపాత్రుడుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో హైకోర్టు విచారణ చేపట్టింది. 10 ఏళ్లకు పైగా శిక్ష విధించే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa