కేరళలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. కొట్టాయం జిల్లాలోని అర్పుక్కర, తలయాజం పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ తెలిపారు. ఈ క్రమంలో కిలోమీటరులోపు 8వేలకు పైగా పెంపుడు పక్షులను చంపాలని పశుసంవర్థక శాఖ ఆదేశించింది. నేటి నుంచి 3 రోజుల పాటు వ్యాధి కేంద్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో బాతులు, కోళ్లు, పక్షులు, గుడ్లు, ఇతర పెంపుడు పక్షుల మాంసం సహా సేంద్రియ ఎరువుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa