అల్లం పాలు తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అల్లం పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ ఫెక్షన్లు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయని పేర్కొన్నారు. జలుబు, ఫ్లూ, అజీర్ణం సమస్యలు తగ్గుతాయని వెల్లడించారు. పాలలో తురిమిన అల్లం వేసి 5 నిమిషాలు మరిగించి తర్వాత మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి.. తర్వాత పాత్రను దించి బెల్లంపొడి వేసి కలపాలి. పాలను గోరువెచ్చగా తాగితే సమస్యలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు.