మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ప్రజల్ని వేటాడి చంపేస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే రెండు వేర్వేరు చోట్ల పులులు పంజా విసరడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఒకే జిల్లాకు చెందిన 50 మందిపై పులులు దాడి చేసి చంపాయని అటవీ అధికారులు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర అటవీ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆందోళన వ్యక్తం చేశారు. పులుల బారి నుంచి ప్రజలను కాపాడాలని లేకుంటే అటవీ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.