ఢిల్లీలో బుధవారం యాసిడ్ దాడికి గురైన 17 ఏళ్ల బాలిక స్పృహలోకి వచ్చింది. అయితే, ఆమె ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని తెలుస్తోంది. ఇంకా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సఫ్దర్ గంజ్ వైద్యులు తెలిపారు. ‘ఆమె స్పృహలోకి వచ్చింది. చికిత్సకు స్పందిస్తోంది. బాలిక ముఖానికి 8 శాతం గాయాలయ్యాయి. కళ్లు కూడా దెబ్బతిన్నాయి. చికిత్స ఇంకా కొనసాగుతోంది. ఆఫ్తల్మాజిస్ట్ లు ఆమెను పర్యవేక్షిస్తున్నారు’ అని సీనియర్ వైద్యుడు తెలిపారు. బుధవారం ఉదయం సోదరితో కలిసి బాలిక స్కూల్ కు వెళ్తుండగా బైక్ పై ఇద్దరు వచ్చి ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు.