ఏపీ సీఎం జగన్ నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. వైసీపీ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ వర్క్‌షాప్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించడానికి ప్రతినెలా సీఎం జగన్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.