హనీమూన్ ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఓ నవ వరుడు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన కర్ణాటక హవేరి జిల్లా హిరేకరూరు తాలూకా కొడద వద్ద జరిగింది. దావణగెరె జిల్లా జిగళికి చెందిన సంజయ్ టెక్కీగా పని చేస్తున్నాడు. ఆయనకు ప్రీతి అనే యువతితో నవంబర్ 28న వివాహమైంది. వారు హనీమూన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ఆదివారం శిరసి మారికాంబా దేవిని దర్శించుకొని తిరిగి వస్తుండగా వీరి బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో సంజయ్ ప్రాణాలు కోల్పోయాడు. భర్త మృతి విషయం తెలుసుకున్న ప్రీతి కన్నీరు మున్నీరైంది.