ప్రస్తుత రోజుల్లో ఆహారం, జీవనశైలి కారణంగా చాలామంది కడుపునొప్పితో బాధపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వెంటనే కడుపునొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అల్లాన్ని నీళ్లలో మరిగించి అందులో తేనె కలిపి తీసుకుంటే గ్యాస్, అజీర్ణం వంటి కడుపునొప్పులు సులభంగా తగ్గుతాయి. ఈ ఔషధ రసాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోంపు నీరు తాగడం వల్ల కూడా వెంటనే కడుపునొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.