తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. వివాహానికి ముందే గర్భం దాల్చినందుకు కుమార్తెను హతమార్చాడో తండ్రి. తిరుచ్చి జిల్లా తిరుప్పరత్తురై వద్ద ఈ నెల 9వ తేదీన అప్పుడే పుట్టిన మగశిశువును ఎవరో బయటే వదిలేసినట్లు స్థానికులు గుర్తించి, ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో ఎలమనూర్‌కు చెందిన ఓ కళాశాల విద్యార్థి (19) ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థిని విష ప్రభావంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండడాన్ని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మృతి చెందింది. వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చడంతో బిడ్డకు జన్మనిచ్చిందని వెల్లడైంది. ఈ విషయం తెలియడంతో తండ్రి సెల్వమణి, మేనత్త మల్లికతో కలిసి ఆ బాలికతో బలవంతంగా పురుగుల ముందు తాగించారని తెలిసింది.