కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను మానుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాల్లో విశ్వవిధ్యాలయాలు సమస్యలు, ఉపాధ్యాయులు కోరత, టాయిలెట్ కూడా లేవన్నారు. ఇప్పటికి ఎటువంటి గుర్తింపు లేకుండా లైసెన్సులు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు నడుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్ నాయకులు టీసీఎచ్ చెన్నయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.