చెన్నూరు నగర శివారులోని శాటిలైట్ సిటీకి చెందిన ఓ యువతి ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన మధుసూదన్ రావు శాటిలైట్ సిటీలో నివశిస్తున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమార్తె సాయి తులసి (26) నగరంలోని ఓ కళాశాలలో న్యాయ విద్య అభ్యశిస్తోంది. గతంలో వీరు కడప నగరంలో జీవిస్తుండే వారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంతకాలంగా శాటిలై ట్ సిటీలో ఉంటున్నారు. సాయి తులసి అనారోగ్యానికి గురై ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అందరూ ఇంట్లో ఉండగానే తులసి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. ఎంత సేపటికి తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో పరిశీలించగా అప్పటికే ఉరి పోసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.