ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారులు ఎంత మంది?.. వారి ఫోటోలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..... వెయ్యి మంది ఉన్న చోట ఉన్న పోలింగ్ బూతులను తీసివేసి, వంద మంది ఉన్న చోటకు మారుస్తున్నారని, అక్కడ రౌడీయిజంతో దొంగ ఓట్లు కోసం ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఇండ్లులేని బయట ప్రాంతంలోని వారికి గ్రామాల్లో ఇండ్లు ఇస్తూ.. గ్రామాల్లో ఎన్నికల నాటికి రౌడీ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు. విపక్షాల ఐక్యతతోనే వైసీపీ రౌడీయిజాన్ని ఎదుర్కొగలమనే సత్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గ్రహించాలన్నారు.