తమ వినియోగదారులకు IDFC ఫస్ట్ బ్యాంక్ బంపరాఫర్ ప్రకటించింది. నేడు బ్యాంకు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 25 రకాల బ్యాంకు సేవలపై ఛార్జీలను రద్దు చేసింది. క్యాష్ డిపాజిట్లు, విత్ డ్రాలు, డీడీలు, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, చెక్ బుక్, వడ్డీ సర్టిఫికేట్, ఇంటర్నేనల్ ఏటీఎం వాడకం, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ లు వంటి సర్వీసులపై ఖాతాదారులకు విధించే ఛార్జీలను నేడు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనిని 'జీరో ఫ్రీ బ్యాంకింగ్'గా IDFC పేర్కొంది.